జూలై 3 వ తేదీన పదిలక్షల మందితో ప్రధాని మోదీ బహిరంగసభను నిర్వహిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. వచ్చే నెల 2,3 వ తేదీల్లో హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించనున్నట్లు తెలిపిన బండి సంజయ్...ఇందుకోసం నోవాటెల్ హోటల్ ను పరిశీలించారు. కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సహా 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనున్నట్లు తెలిపారు.